Type Here to Get Search Results !

.తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..

 


తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. మరో 3 గంటలు మోస్తరు వర్షాలు

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణలో పలు జిల్లాల్లో మరో మూడు గంటల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సమాచారం వెల్లడించింది.

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు రాత్రి 9.30 గంటల వరకు కొనసాగవచ్చని అంచనా.

మరోవైపు హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కూడా కొనసాగవచ్చని సమాచారం. వచ్చే 2–3 గంటల్లో నగరంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language