Type Here to Get Search Results !

రామాయంపేటలో టాటా మోటార్స్‌ 8వ సబ్‌ బ్రాంచ్‌ ప్రారంభం



రామాయంపేటలో టాటా మోటార్స్‌ 8వ సబ్‌ బ్రాంచ్‌ ప్రారంభం

నాణ్యమైన వాహనాలు, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

రామాయంపేట, ఆగస్టు 8 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టాటా మోటార్స్‌ 8వ సబ్‌ బ్రాంచ్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. సంస్థ ఎండీ మహిపాల్ రెడ్డి, జయప్రద ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎండీ మహిపాల్ రెడ్డి, జయప్రద మాట్లాడుతూ రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వాహనాలు, మెరుగైన సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సబ్‌ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

షోరూమ్‌లో వినియోగదారుల ఆదరణ పొందుతున్న టియాగో, టిగోర్, పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, కర్వ్, సియెర్రా, హారియర్, సఫారీ తదితర టాటా మోటార్స్‌ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నెక్సాన్‌ కారు కొనుగోలుపై రూ.1 లక్ష వరకు ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్‌ ఆగస్టు నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

టెస్ట్‌ డ్రైవ్‌, వాహన బుకింగ్స్‌ కోసం 9848958399, 8328147984 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జీఎం పార్థసారథి, బీఎం నరేష్, నిజామాబాద్ సేల్స్‌ మేనేజర్ గోవర్ధన్, అకౌంట్‌ మేనేజర్ వంశీకృష్ణతో పాటు సంస్థ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language