మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 184 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లతో పాటు 156 ఔట్సోర్సింగ్ పోస్టులు
మెదక్, ఆగస్టు 12: మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్ర తెలిపారు. కాంట్రాక్టు విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 12 నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్వీకరించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా మెడికల్ కాలేజీలో పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ కేటగిరీలకు చెందిన 156 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
ఔట్సోర్సింగ్ పోస్టుల వివరాలు
- అనస్థీషియా టెక్నీషియన్ – 8
- ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 1
- ఆడియో విజువల్ టెక్నీషియన్ – 1
- బార్బర్ – 6
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ – 3
- కార్పెంటర్ – 1
- క్యాటలాగర్ – 1
- చైల్డ్ సైకాలజిస్ట్ – 1
- సిటీ టెక్నీషియన్ – 4
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 37
- డెంటల్ టెక్నీషియన్ – 1
- దోబీ/ప్యాకర్ – 6
- ఈసీజీ టెక్నీషియన్ – 4
- ఎలక్ట్రీషియన్ – 6
- గ్యాస్ ఆపరేటర్ – 4
- ల్యాబ్ అటెండర్ – 19
- మ్యూజియం అసిస్టెంట్ కం ఆర్టిస్ట్ – 1
- ఆఫీస్ సబార్డినేట్ – 24
- ప్లంబర్ – 2
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్ – 1
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ – 7
- రేడియాలజీ టెక్నీషియన్ – 1
- రికార్డు క్లర్క్/రికార్డు అసిస్టెంట్ – 2
- రిఫ్రాక్షన్ ఆప్టిషియన్ – 1
- స్పీచ్ థెరపీ – 1
- టైలర్ – 1
- థియేటర్ అసిస్టెంట్ – 2
- ఓటీ టెక్నీషియన్ (అనస్థీషియా) – 10
ఔట్సోర్సింగ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్వీకరించనున్నట్లు తెలిపారు.
అర్హతలు, విద్యార్హతలు, దరఖాస్తు ఫారం, ఇతర మార్గదర్శకాల కోసం www.gmcmedak.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రిన్సిపల్ నితిన్ కాబ్ర బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.
— తెలుగు ట్రెండ్స్ | మెదక్


Anesthesia technition
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి