Type Here to Get Search Results !

అర్ధరాత్రి మాయమైన 19 ఏళ్ల యువతి.. ధర్మారంలో మిస్సింగ్ కలకలం, దర్యాప్తు ముమ్మరం

 


అర్ధరాత్రి మాయమైన 19 ఏళ్ల యువతి.. ధర్మారంలో మిస్సింగ్ కలకలం

దర్యాప్తు చేస్తున్న వెల్దుర్తి ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి

వెల్దుర్తి మండలం, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించిన 19 ఏళ్ల యువతి అర్ధరాత్రి సమయంలో కనిపించకుండా పోయిన ఘటన వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో కలకలం రేపింది. మర్కంటి సాయిలు కుమార్తె మర్కంటి దివ్య అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆగస్టు 19 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో దివ్య కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గమనించగా దివ్య ఇంట్లో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అప్రమత్తమై దివ్య కోసం గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. తెలిసిన వారు, బంధువుల వద్ద ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. దివ్య ఎక్కడికి వెళ్లింది? ఏ కారణంతో ఇంటి నుంచి వెళ్లింది? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై వెల్దుర్తి ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. దివ్య సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

వెల్దుర్తి రిపోర్టర్: నరసింహా గౌడ్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language