అంతారం గేటు వద్ద విషాదం.. గేదె దాడిలో వ్యక్తి దుర్మరణం


 


అంతారం గేటు వద్ద విషాదం.. గేదె దాడిలో వ్యక్తి మృతి

కౌడిపల్లి మండలం, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని అంతారం గేటు వద్ద గేదె దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొల్చారం మండలం రాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

అదే సమయంలో అడవి ప్రాంతం నుంచి నాలుగు గేదెలు రోడ్డువైపు వెళ్తున్నాయి. వాటిలో ఓ గేదె ఒక్కసారిగా వ్యక్తిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గేదె కొమ్ములకు చిక్కుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కొల్చారం రిపోర్టర్: ముత్తయ్య | తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads