రిపోర్టర్: బి. యాదగిరి
ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు
నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
నవ పలుకులు – రామాయంపేట, ఆగస్టు 25:
ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకుడు దాయం నరేష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేసి వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న నాయకుడి జన్మదిన వేడుకలను పేదలు, రోగులకు ఉపయోగపడే విధంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజలకు సేవ చేయడమే నిజమైన వేడుకలకు అర్థమని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాయం నరేష్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి