Type Here to Get Search Results !

“అయ్యా.. అన్నం పెట్టమని అడగడం లేదు.. ఒక్క యూరియా సంచి ఇవ్వండి!” రైతు కన్నీటి వేడుకోలు


 

అయ్యా.. అన్నం పెట్టమని అడగడం లేదు.. ఒక్క యూరియా సంచి ఇవ్వండి!

కాళ్లు మొక్కిన రైతు.. కలచివేసిన దృశ్యం | యూరియా కోసం రైతుల అవస్థలు

కొల్చారం, ఆగస్టు 12: యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు అద్దం పట్టే ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బుధవారం చోటుచేసుకుంది.

యూరియా సంచి కోసం వచ్చిన ఓ రైతు.. అక్కడి సిబ్బంది కాళ్లు మొక్కుతూ “అయ్యా.. నాకు అన్నం పెట్టమని అడగడం లేదు.. నీ కాళ్లు మొక్కుతా.. నాకు ఒక్క యూరియా సంచి ఇవ్వండి” అంటూ వేడుకున్న ఘటన అక్కడున్న రైతుల హృదయాలను కలచివేసింది.

మరోవైపు చిట్కుల గ్రామానికి చెందిన బోయిని రాములు అనే రైతు యూరియా కోసం సహకార సంఘానికి వచ్చి తన   వద్ద స్మార్ట్‌ఫోన్ లేదని, ఫోన్‌లో యూరియా బుక్ చేసుకోవడం కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. “సార్.. నా దగ్గర చిన్న ఫోన్ మాత్రమే ఉంది. నేను యూరియా ఎలా బుక్ చేసుకోవాలి? ఎవరైనా నాకు సహాయం చేయండి” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని, తనకు ఎవరూ తోడుగా లేరని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం లేని, స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేని రైతులు యూరియా బుకింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలియని రైతులకు అధికారులు, సిబ్బంది సహకరించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు స్పందించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వివిధ గ్రామాల రైతులు కోరారు.

— తెలుగు ట్రెండ్స్ | కొల్చారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language