పాపన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. జాతీయ జెండాలతో మార్మోగిన పురవీధులు 🇮🇳

 



పాపన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పాపన్నపేట, ఆగస్టు 12: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు.

మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాసు రాధా మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జాతీయవాదులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకుని పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ పాపన్నపేట మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ.. దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎంతోమంది భారతమాత బిడ్డల త్యాగాల ఫలితమని అన్నారు. యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో రాణిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బీకొండ రాములు నేత, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్, బీజేపీ జిల్లా నాయకులు సుభాష్ చందర్ గౌడ్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, నాగభూషణం, మల్లేశం, బొక్కల భాగేష్, వడ్ల భాగేష్, జిన్నగోపాల్, రాజు, చంద్రయ్య, సుంకరి కిష్టయ్య, నర్సింలు, వెంకట్, శ్రావణ్, గౌస్, జగదీష్, సంతోష్ గౌడ్, కనుకంటి విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్, అధ్యాపకులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్ | పాపన్నపేట

0/Post a Comment/Comments

ads

ads