Type Here to Get Search Results !

తూప్రాన్‌లో షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాల కలకలం.. సీసీ కెమెరాలతో నిందితుడు గుర్తింపు

 


సీసీ కెమెరాలతో షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాల గుట్టురట్టు

తూప్రాన్, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్ రిపోర్టర్ ఆర్. చంద్రశేఖర్): తూప్రాన్ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న రెండు షట్టర్ దుకాణాల్లో జరిగిన దొంగతనాల కేసులను తూప్రాన్ పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణం, చెప్పుల దుకాణంలో ఇటీవల షట్టర్ లిఫ్టింగ్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిగా కందుల సత్యనారాయణను గుర్తించారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటున్న అతడి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో సత్యనారాయణ ఇతర ప్రాంతాల్లోనూ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో దొంగతనం కేసులో అరెస్టై ప్రస్తుతం నల్గొండ జైలులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

న్యాయస్థానం అనుమతితో నిందితుడిని శుక్రవారం నల్గొండ జైలు నుంచి మెదక్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అనంతరం తిరిగి జైలుకు తరలించారు.

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి కేసును ఛేదించిన తూప్రాన్ పోలీసులను పలువురు అభినందించారు. నేరస్థులను గుర్తించి కేసులను ఛేదించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.

– ఆర్. చంద్రశేఖర్, తెలుగు ట్రెండ్స్, తూప్రాన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language