Type Here to Get Search Results !

వరి పంటలో నానో యూరియా.. రైతులకు అవగాహన

 

వరి పంటలో నానో యూరియాపై క్షేత్ర ప్రదర్శన

నార్సింగి, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్ ): మండలంలోని జప్తి శివునూర్ గ్రామంలో రైతు గంగనబోయిన రాములు పొలంలో వ్యవసాయ శాఖ, ఆత్మ పథకం ఆధ్వర్యంలో వరి పంటలో నానో యూరియా వినియోగంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంతో ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక బస్తా సాధారణ యూరియాకు సమానమని తెలిపారు.

లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల నానో యూరియా కలిపి నాటిన 25 రోజుల తర్వాత ఒకసారి, పూతకు వారం ముందు మరోసారి పిచికారీ చేయాలని రైతులకు సూచించా


రు. నానో యూరియాను సూచించిన మోతాదులో, సరైన పద్ధతిలో వినియోగించి ప్రయోజనం పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ జనార్దన్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

– రామాయంపేట బి. యాదగిరి, తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language