Type Here to Get Search Results !

టేక్మాల్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకరణ కార్యక్రమం

 


టేక్మాల్ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఘనంగా దీక్ష స్వీకరణ కార్యక్రమం

టేక్మాల్ (పాపన్నపేట), ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణ ఆదర్శ పాఠశాల టేక్మాల్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు “దీక్ష స్వీకరణ” కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జనరల్ సెక్రెటరీ ఇప్ప రాజేందర్, స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ తలారి నాగరాజు, జిల్లా ట్రైనింగ్ కమిషనర్ కమలతో పాటు స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల స్కౌట్ మాస్టర్ గజేంద్రుల నర్సింలు, గైడ్ కెప్టెన్ కిరణ్మయి, పాఠశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు మాట్లాడుతూ.. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి గుణాలు పెంపొందుతాయని తెలిపారు.

విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చురుకుగా పాల్గొని సమాజ సేవలో ముందుండాలని సూచించారు. దీక్ష స్వీకరణ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language