యువతే దేశ భవిష్యత్తు.. బాధ్యతతో ముందుకు సాగాలి: ప్యానల్ లాయర్ బాల నరసింహులు

 



యువతే దేశానికి వెన్నెముక.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర: ప్యానల్ లాయర్ బాల నరసింహులు

మెదక్, ఆగస్టు 12: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి. నీలిమ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు వారి బాధ్యతలు, సమాజం పట్ల బాధ్యత, దేశ అభివృద్ధిలో వారి పాత్రపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ప్యానల్ లాయర్ శ్రీ బాల నరసింహులు మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక వంటివారని అన్నారు. యువతలో ఉన్న ఆలోచనలు, ప్రతిభ, శక్తి దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.

యువత తమకు నచ్చిన రంగంలో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. సమాజం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ మహమ్మద్ యూసుఫ్ అలీ, ఐటీఐ ఏటీఓ రవి భరత్, ప్లాన్ ఇండియా ఎన్జీవో ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, గంగాధర్ గౌడ్, ఐటీఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్ | మెదక్

0/Post a Comment/Comments

ads

ads