Type Here to Get Search Results !

తుక్కాపూర్ విద్యార్థులకు ఉచిత స్పోర్ట్స్ డ్రెస్.. ఉపసర్పంచ్ ఆరే రవీందర్ ఉదారత

 


తుక్కాపూర్ విద్యార్థులకు ఉచిత స్పోర్ట్స్ డ్రెస్.. ఉపసర్పంచ్ ఆరే రవీందర్ ఉదారత

ఆగస్టు 15 సందర్భంగా సుమారు రూ.20 వేల విలువైన క్రీడా దుస్తుల పంపిణీ

కొల్చారం , ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
తుక్కాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఉపసర్పంచ్ ఆరే రవీందర్ ముందుకు వచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు సుమారు రూ.20 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్‌లను ఉచితంగా అందించారు.

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గత సంవత్సరం జనవరి 26 సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు, గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు అందించడం పట్ల ఉపసర్పంచ్ ఆరే రవీందర్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్, ఉపాధ్యాయురాలు ప్రమీల, వార్డు సభ్యులు గంగయ్య, సుధాకర్, మమత, శ్రీనివాస్, గ్రామ పెద్దలు అంబాజీరావు, లింగప్ప, మల్లప్ప, సిద్ధప్ప, సిద్దు, మల్లయ్య, టేక్మాల్ మల్లప్పతో పాటు యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language