Type Here to Get Search Results !

తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరలింపుపై యువత సమరభేరి

 

తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరలింపుపై యువత సమరభేరి

ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నా.. స్కూల్ తరలింపెందుకు?
వెల్దుర్తికే పబ్లిక్ స్కూల్.. కుక్కనూరుకు తరలించొద్దంటూ రిలే దీక్ష

వెల్దుర్తి మండలం, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మండల పరిధిలోని కుక్కనూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గ్రామ యువత ఆందోళనకు దిగింది. గురువారం వెల్దుర్తి బస్టాండ్ సమీపంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన యువకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని పాఠశాలను కుక్కనూరుకు తరలించవద్దంటూ నినాదాలు చేశారు.

వెల్దుర్తిలో పాఠశాల నిర్మాణానికి స్థలం లేదంటూ కొందరు అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించడంతోనే తరలింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని యువకులు ఆరోపించారు. గ్రామంలో సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను మరో గ్రామానికి తరలించాలనే నిర్ణయం సరికాదని వారు మండిపడ్డారు.

మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల వెల్దుర్తితో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు కూడా విద్యా పరంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని యువత పేర్కొన్నారు. పాఠశాలను కుక్కనూరుకు తరలిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిరోజూ రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెల్దుర్తిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికారులు పరిశీలించి, అక్కడే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని యువకులు డిమాండ్ చేశారు. “వెల్దుర్తికే తెలంగాణ పబ్లిక్ స్కూల్.. తరలింపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

తమ డిమాండ్‌పై ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యువకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండం ఆదర్శ్, శేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, దేవేందర్ గౌడ్, చందు, కిచ్చుగారి సీను, నవీన్, ముకుందం, ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language