Type Here to Get Search Results !

రావెల్లి పాఠశాల విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ

 

రావెల్లి పాఠశాల విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ

తూప్రాన్: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు రావెల్లి ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు వార్డు కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్కూల్ షూస్, రెండు జతల సాక్స్‌లను శుక్రవారం పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ హాజరయ్యారు. విద్యార్థులకు షూస్, సాక్స్‌లను అందజేసి వారిని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ సమతా కాశిరెడ్డి, తూప్రాన్ మండల ఎంఈఓ, వార్డు కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language