Type Here to Get Search Results !

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

 

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ముఖ్యమంత్రి సభకు భారీగా తరలిరావాలి: ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

శుక్రవారం నర్సాపూర్‌లో విలేకరు


లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి 6 లక్షల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సభ ద్వారా శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా పాలనను కొనసాగిస్తోందని అన్నారు. ఈ సభకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ తదితరులు హాజరవుతారని తెలిపారు.

నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు రిజ్వాన్, సర్పంచ్ ఉదయ్ కుమార్, నాయకులు మాధవరెడ్డి, నరేందర్‌రెడ్డి, రషీద్, హరిష్ వర్ధన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language