Type Here to Get Search Results !

తూప్రాన్ గీతా స్కూల్‌లో ఆకట్టుకున్న దేశభక్తి ప్రదర్శన


 

తూప్రాన్ గీతా స్కూల్‌లో ఆకట్టుకున్న దేశభక్తి ప్రదర్శన

సుమారు 400 మంది విద్యార్థులతో ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తూప్రాన్: ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు.

విద్యార్థులు కలిసి భారతదేశ పటం ఆకారంలో కూర్చోవడంతో పాటు, దాని చుట్టుపక్కల “మేము భారతీయులం” అనే ఆకారాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వివిధ మతాల చిహ్నాల ఆకారాల్లో కూర్చొని సర్వమత సామరస్యం, ఐక్యత, జాతీయ సమైక్యత సందేశాన్ని చాటారు.

విద్యార్థుల సమిష్టి ప్రదర్శనతో పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ ప్రదర్శనను చూసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language