Type Here to Get Search Results !

కొల్చారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

 

కొల్చారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసిన ఉపాధ్యాయులు

కొల్చారం, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కొల్చారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆధునిక కాలంలో కనుమరుగవుతున్న పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ధరణి తెలిపారు.

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని నెత్తిన బోనాలు ఎత్తుకున్నారు. అనంతరం గ్రామంలోని దుర్గమ్మ, పోచమ్మ ఆలయాలకు చేరుకుని బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కలుగుతుందని ప్రిన్సిపాల్ ధరణి పేర్కొన్నారు. పండుగల వెనుక ఉన్న సాంస్కృతిక విలువలను విద్యార్థులు తెలుసుకోవడం అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధరణి, ఉపాధ్యాయులు వినోద, సుష్మ, ధనలక్ష్మి, లక్ష్మి, లింగమై, స్వరూప రాణి, రీనా కుమారి, చంద్రకళ, జయశీల, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language