Type Here to Get Search Results !

విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

 

విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

తన సొంత నిధులతో అందజేసిన కౌన్సిలర్ మన్నె స్వామి

తూప్రాన్: మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అల్లాపూర్ పాఠశాల విద్యార్థులకు వార్డు కౌన్సిలర్, యువనాయకుడు మన్నె స్వామి తన సొంత నిధులతో స్పోర్ట్స్ యూనిఫామ్స్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. విద్యార్థులపై ప్రేమతో, వారి క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ సమతా కాశిరెడ్డి, ఎంఈఓతో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అతిథులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

అనంతరం చైర్మన్ రజిని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల ప్రేమతో తన సొంత నిధులతో స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందించిన కౌన్సిలర్ మన్నె స్వామిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అల్లాపూర్ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అల్లాపూర్ గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language