రంగంపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

 

రంగంపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై మహమ్మద్ ముహీనుద్దీన్

కొల్చారం: మండలంలోని రంగంపేట గ్రామంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. బీజేపీ కొల్చారం మండల శాఖ అధ్యక్షుడు ఘనపూర్ హరీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కొల్చారం ఎస్సై మహమ్మద్ ముహీనుద్దీన్, రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగి స్వర్ణలత విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రంగంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుంచి విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఘనపూర్ హరీశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అనే ఐక్యతా భావాన్ని హర్ ఘర్ తిరంగా యాత్ర చాటిచెబుతుందని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని, యువత భవిష్యత్‌లో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని కోరారు. ర్యాలీకి సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా మండల కన్వీనర్ చిట్టుకుల గిరి, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గ్యాన్సింగ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు యాదగిరి, మెదక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎంచర్ల శేఖర్ యాదవ్, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్, ఎస్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు శివలాల్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంత్ నేత, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మలావత్ అంజి, మండల ఉపాధ్యక్షులు రవిగౌడ్, వెంకట్, శక్తి కేంద్రం ఇన్‌చార్జ్ మల్లేశం, బూత్ అధ్యక్షులు పోచందర్ సాయి, శ్రీశైలం, మహేష్ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు ప్రవీణ్ యాదవ్, నరేశ్, నాగరాజు, అరుణ్, గిరిజన మోర్చా నాయకులు గోపాల్, శంకర్, బీజేపీ నాయకుడు కురుమ మానయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads