Type Here to Get Search Results !

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన పోతారం సర్పంచ్

 సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన సర్పంచ్ పుట్టా వినోదా మహేందర్


తూప్రాన్, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్


): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను పోతారం సర్పంచ్ పుట్టా వినోదా మహేందర్ తీవ్రంగా ఖండించారు.


రాజకీయాల్లో విమర్శలు, అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ.. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, ప్రజలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని పుట్టా వినోదా మహేందర్ డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలపై ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలకు దారితీయకూడదని స్పష్టం చేశారు.


– ఆర్. చంద్రశేఖర్, తెలుగు ట్రెండ్స్, తూప్రాన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language