Type Here to Get Search Results !

నాగులపల్లి బ్రిడ్జిపై డీసీఎం బోల్తా.. ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

 



నాగులపల్లి బ్రిడ్జిపై డీసీఎం లారీ ప్రమాదం.. ట్రాఫిక్ క్లియర్ చేసిన తూప్రాన్ పోలీసులు

తూప్రాన్, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్ రిపోర్టర్ ఆర్. చంద్రశేఖర్): తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపల్లి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం లారీ ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే తూప్రాన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన డీసీఎం లారీని రోడ్డు పక్కకు తరలించారు. రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించి ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేశారు.

పోలీసులు తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు కొనసాగుతున్నాయి.

– ఆర్. చంద్రశేఖర్, తెలుగు ట్రెండ్స్, తూప్రాన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language