సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్‌కు ఘన సన్మానం

 


సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ తులసీరామ్‌కు ఘన సన్మానం

చిన్నశంకరంపేట, ఆగస్టు 22 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ తులసీరామ్‌ను మండల పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డెన్ తులసీరామ్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ.. హాస్టల్‌లో విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి వార్డెన్ తులసీరామ్ చేస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడంతో పాటు వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని పద్మశాలి సంఘం నాయకులు కోరారు.

సన్మానం అందుకున్న వార్డెన్ తులసీరామ్ పద్మశాలి సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో విద్యార్థుల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎర్రగంటి కృష్ణయ్య, ఉడుత శ్రీమన్నారాయణ, తుమ్మ శంకరయ్య, ముదిగొండ శివకుమార్, చిప్ప కృష్ణ, బైండ్ల బాలరాజ్, వనం నర్సింలు తదితర పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads