Type Here to Get Search Results !

అందోల్ కేజీబీవీలో బాలికలకు అవగాహన.. 3,000 శానిటరీ ప్యాడ్ల పంపిణీ

 



అందోల్ కేజీబీవీలో బాలికలకు ఆరోగ్యం, భద్రతపై అవగాహన

అందోల్, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం అందోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రుతుక్రమం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, బాలికల భద్రత, సాధికారత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అందోలు–జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఏ. సత్యనారాయణ (చిట్టిబాబు) మాట్లాడుతూ బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, రక్షణ, సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. బాలికలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

అధికారులు మాట్లాడుతూ ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందించడం, ఆమె ప్రతిభను ప్రోత్సహించడం, స్వయం సాధికారత సాధించేలా చేయడం సమాజం మొత్తం బాధ్యత అని తెలిపారు. విద్యార్థినులు చిన్న వయస్సు నుంచే స్పష్టమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకుని, సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర కృషితో వాటిని సాధించాలని సూచించారు.

సైబర్ భద్రతపై అవగాహన

బాలికల భద్రత, రక్షణలో భాగంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ భద్రతపై అధికారులు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు.

అలాగే బాలికల ఆరోగ్యానికి సమతుల్యమైన పోషకాహారం ఎంతో ముఖ్యమని, రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, పాలు తదితర పోషక పదార్థాలను తీసుకోవాలని సూచించారు.

3,000 శానిటరీ ప్యాడ్ల పంపిణీ

ఈ సందర్భంగా శానిటరీ ప్యాడ్ బ్యాంకు కింద విద్యార్థినులకు మొత్తం 3,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జోగిపేట సీడీపీఓ మాధులిక, అందోల్ తహసీల్దార్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎంఈఓ కృష్ణ, ఎస్‌ఓ జ్యోతి, ఇన్‌చార్జి ఎస్‌ఓ సుకన్య, మెడికల్ ఆఫీసర్ శంకర్, జిల్లా సమన్వయకర్త పల్లవి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎస్‌ఐ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, జెండర్ స్పెషలిస్ట్, విద్యార్థినులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language