తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం.. ఏడో రోజుకు చేరిన దీక్ష
వెల్దుర్తి మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్.. సమస్య పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామన్న యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు
వెల్దుర్తి మండలం, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చెల్లపల్లి తాండా యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. వెల్దుర్తి బస్‌స్టాండ్ చౌరస్తాలో కొనసాగుతున్న దీక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
వెల్దుర్తి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని దీక్ష చేపట్టిన వారు తెలిపారు. పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేసే వరకు తమ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని వెల్దుర్తి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించాలని, తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు.
రిపోర్టర్: నర్సింహా గౌడ్, వెల్దుర్తి
తెలుగు ట్రెండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి