Type Here to Get Search Results !

మాసాయిపేటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

 


మాసాయిపేటలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

వ్యవసాయ పొలంలో బుష్ కట్టింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

మాసాయిపేట, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఎడ్ల ప్రవీణ్ (32) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్ వ్యవసాయ పొలం వద్ద బుష్ కట్టర్‌తో గడ్డి, పొదలు తొలగించే పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలం వద్ద తెగిపడి ఉన్న విద్యుత్ వైరు అతడికి తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడికి భార్య లాస్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రిపోర్టర్: నర్సింహా గౌడ్, వెల్దుర్తి
తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language