తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం పోరాటం.. 11వ రోజుకు చేరిన రిలే దీక్ష

 


తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం 11వ రోజుకు చేరిన రిలే దీక్ష

వెల్దుర్తి మండలం, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. పాఠశాల ఏర్పాటు కోసం కొనసాగుతున్న దీక్షకు రోజురోజుకూ వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

ఇందులో భాగంగా ఆదివారం వెల్దుర్తి రజక సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకునేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పాఠశాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం, అధికారులు సానుకూల నిర్ణయం తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని దీక్ష నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలు వర్గాల ప్రజలు దీక్షకు మద్దతుగా ముందుకు వస్తుండటంతో ఉద్యమానికి మరింత బలం చేకూరుతోందన్నారు.

మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నాయకులు పేర్కొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – వెల్దుర్తి రిపోర్టర్ న. నర్సింహా గౌడ్

0/Post a Comment/Comments

ads

ads