Type Here to Get Search Results !

మల్కాపూర్‌లో కొనసాగుతున్న స్వచ్ఛత ఉద్యమం.. 415వ వారం ఘనంగా స్వచ్ఛభారత్

 


మల్కాపూర్‌లో 415వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం

తూప్రాన్, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 415వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆదివారం 6వ వార్డులో నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచే లక్ష్యంతో కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.

కమ్యూనిటీ హాల్ వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుభ్రం చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని రెండు గంటల పాటు శ్రమించి చదును చేశారు. దీంతో రహదారి పరిసరాలు మరింత పరిశుభ్రంగా మారాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు నిరంతరం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రతి వారం కొనసాగిస్తూ మల్కాపూర్‌ను ఎల్లప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని కోరారు.

కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, రేఖ నాగరాజుగౌడ్, ఫిషరీస్ మాజీ చైర్మన్ నరసింహులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – తూప్రాన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language