Type Here to Get Search Results !

ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని సర్పంచ్‌కు వినతి

 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని సర్పంచ్‌కు వినతి

తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో వినతిపత్రం అందజేత

తూప్రాన్ మండలం, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్): తూప్రాన్ మండలంలోని దాతర్‌పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామ సర్పంచ్ చింతల జయరాములుకు వినతిపత్రం అందజేశారు.

గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాల్ అవసరమని వారు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కమ్యూనిటీ హాల్‌ను త్వరగా మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రెసిడెంట్ మేకల ప్రవీణ్ మాదిగ, కొలిచెల్మే ప్రశాంత్, సాంఘిక సంక్షేమ యువకుడు లక్ష్మణ్ మాదిగ, నరసింహారావు, మేకల నెల్లూరు, కంచెలిమే నాగేష్, కొలిచెలిమే తరుణ్, మేకల నాగరాజు, బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కొలిచెమె అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ | తూప్రాన్ మండలం, శ్రీనివాస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language