Type Here to Get Search Results !

ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ నేతలు

 

ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ నేతలు

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై నాయకులను అభినందించిన కేంద్ర మంత్రి

సిద్దిపేట, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్): సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు శనివారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై నాయకులు మంత్రితో చర్చించారు.

ఇటీవల జరిగిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు అత్యంత సజావుగా, ఘనంగా నిర్వహించడంపై మంత్రి కిషన్‌రెడ్డి జిల్లా బీజేపీ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని ప్రశంసించారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ కొమురవెల్లి రైల్వే స్టేషన్ ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సిద్దిపేట జిల్లాకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలని కోరారు.

ఈ భేటీలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నత్తి మల్లేష్ ముదిరాజ్, విభీషణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ | సిద్దిపేట శ్రీనివాస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language