Type Here to Get Search Results !

డ్రగ్స్ వ్యతిరేక అవగాహనలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు టాప్-10లో స్థానం

 


మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో టాప్-10లో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్

మనోహరాబాద్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్” సందర్భంగా మాదకద్రవ్యాల వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లు, ఎస్‌హెచ్‌ఓలలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ టాప్-10లో స్థానం దక్కించుకుంది.

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించడంతో పాటు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక, కుటుంబపరమైన సమస్యలను వివరిస్తూ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాల ప్రభావం, పోలీసుల సమర్థవంతమైన చర్యలను పరిగణనలోకి తీసుకుని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ టాప్-10లో ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ బి. సుభాష్ గౌడ్‌కు డీజీపీ శ్రీ సందీప్ శాండిల్య, నార్కోటిక్స్ విభాగం ఇన్‌చార్జ్ అధికారులు ప్రశంసలు అందజేశారు. ఈ గుర్తింపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని ప్రతి ఒక్క సిబ్బంది సమష్టి కృషి, అంకితభావం, సహకారానికి దక్కిన గౌరవంగా ఎస్‌ఐ సుభాష్ గౌడ్ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత పోలీసులతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, “డ్రగ్ ఫ్రీ సొసైటీ” నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు టాప్-10లో స్థానం దక్కడంపై పోలీస్ సిబ్బంది, స్థానికులు అభినందనలు తెలిపారు.

తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language