Type Here to Get Search Results !

మెదక్ పట్టణంలో వీధి కుక్కల బెడద.. చిన్నారిపై దాడితో ప్రజల్లో భయం


మెదక్ పట్టణం నవాబ్‌పేట్‌లో వీధి కుక్క దాడి.. ఆరేళ్ల చిన్నారికి గాయాలు

తెలుగు ట్రెండ్స్ | మెదక్ డెస్క్

మెదక్: మెదక్ పట్టణంలోని నవాబ్‌పేట్‌లో వీధి కుక్క దాడిలో ఆరేళ్ల చిన్నారి గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం, నవాబ్‌పేట్‌లో ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి గాయపడగా, వెంటనే అప్రమత్తమైన స్థానికులు కుక్కను తరిమికొట్టి చిన్నారిని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో నవాబ్‌పేట్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటీవల వీధి కుక్కల సంచారం పెరుగుతుండటంతో చిన్నారులు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language