Type Here to Get Search Results !

ఆర్థిక కష్టాలు.. మెదక్‌లో నిజామాబాద్ తల్లి–కొడుకుల ఆత్మహత్య

 


ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లి–కొడుకుల బలవన్మరణం.. మెదక్‌లో విషాదం



మెదక్, జూలై 3: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లి, కొడుకు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ముత్తాయకోట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్‌కు చెందిన భారతి (62), ఆమె కుమారుడు శ్రీకాంత్ (42) జీవనోపాధి కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌తో పాటు మెదక్‌లో నివసించారు. మెదక్‌లో అద్దె, జీవన వ్యయాలు అధికంగా ఉండటంతో ఏడాది క్రితం ముత్తాయకోటలోని బంధువుల వద్దకు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నారు.

ఇటీవల భారతి పక్షవాతానికి గురికావడంతో మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు సేవలు చేయాల్సి రావడంతో శ్రీకాంత్ రోజువారీ పనులకు వెళ్లలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో గురువారం తల్లి, కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డారు.

శ్రీకాంత్‌కు గతంలో వివాహం జరిగినప్పటికీ కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. అతనికి ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, వారికి వివాహాలు జరిగాయి. తల్లి, కొడుకే కలిసి నివసిస్తున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language