Type Here to Get Search Results !

స్పందించిన అధికారులు.. చిన్నఘనాపూర్‌లో వర్షపు నీటి సమస్యపై పరిశీలన

 

Telugu Trends

వార్త

స్పందించిన అధికారులు.. చిన్నఘనాపూర్‌లో వర్షపు నీటి సమస్యపై పరిశీలన

పూరి గుడిసెల్లోకి నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి: ఎంపీడీవో ఉన్నిసా బేగం

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ మధుసూదన్ రెడ్డి

కొల్చారం, ఆగస్టు 07 (Telugu Trends):

చిన్నఘనాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పూరి గుడిసెల్లోకి వర్షపు నీరు చేరుతున్న ఘటనపై వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు గురువారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

కొల్చారం ఎంపీడీవో ఉన్నిసా బేగం, చిన్నఘనాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఇందిరా ప్రియదర్శిని, సందీప్ కుమార్ కలిసి సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఉన్నిసా బేగం మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పూరి గుడిసెల్లోకి వర్షపు నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఎక్కడ నీటి నిల్వలు ఏర్పడుతున్నాయో అక్కడ వెంటనే డ్రైనేజీ, నీటి పారుదల ఏర్పాట్లు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నఘనాపూర్ గ్రామంలో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడతామని, వర్షపు నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంపీడీవోకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language