Type Here to Get Search Results !

మెదక్‌లో ఘనంగా గద్దర్ మూడో వర్ధంతి నిర్వహణ

 


Telugu Trends

మెదక్‌లో ఘనంగా గద్దర్ మూడో వర్ధంతి నిర్వహణ

ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలే ఊపిరి: నాయకులు

మెదక్, ఆగస్టు 07 (Telugu Trends):

ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ మూడో వర్ధంతిని మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మందుగుల గంగాధర్ మాట్లాడుతూ, "అమ్మా తెలంగాణమా... ఆకలి కేకల గానమా" అంటూ వేలాది పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. తొలి దశ నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్ని వర్గాల ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చిన శక్తి గద్దర్ పాటలేనని, ఆయన పాటలు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమని పేర్కొన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో సాహితీ, సాంస్కృతిక అవార్డులను ప్రకటించి కళాకారులు, సాహితీవేతలను సత్కరిస్తుండడం అభినందనీయమన్నారు. గద్దర్ పాటలు తెలంగాణ పోరాటానికి ఊపిరి పోశాయని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు రాజశేఖర్, భుజరంపేట అరుణ, సిద్ధిరాములు, కో-ఆప్షన్ సభ్యురాలు అనూష, మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్గం నాగరాజు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఉమర్, కాంగ్రెస్ నాయకులు గాడి రమేష్, చెదల నవీన్, సంఘ శ్రీకాంత్, శ్రీను, చెప్పాల సంజీవ్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language