Type Here to Get Search Results !

రామాయంపేటలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ

 


Telugu Trends

రామాయంపేటలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ఆవిష్కరణ

త్వరలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ

రామాయంపేట, ఆగస్టు 07 (Telugu Trends):

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని సిద్ధిపేట రోడ్డు కూడలిలో ఆయన విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి ఆధ్వర్యంలో పట్టణ స్వర్ణకార సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుంకోజు దామోదర్ చారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సబ్బండ వర్ణాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మెదక్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నివాళులర్పించారు. అదే చౌరస్తాలో త్వరలోనే డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, కౌన్సిలర్లు, బీసీ సంఘాల నాయకులు, స్వర్ణకార సంఘం జిల్లా, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు ఘన నివాళులర్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language