Type Here to Get Search Results !

గ్రామాభివృద్ధే లక్ష్యంగా బూరుగుపల్లిలో గ్రామసభ

 


Telugu Trends

గ్రామాభివృద్ధే లక్ష్యంగా బూరుగుపల్లిలో గ్రామసభ

మూడేళ్ల జీపీడీపీ ప్రణాళికపై విస్తృత చర్చ

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతాం: సర్పంచ్ సాయిలు

హవేళీ ఘనపూర్, ఆగస్టు 07 (Telugu Trends):

హవేళీ ఘనపూర్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడేళ్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించే నిధులను పారదర్శకంగా వినియోగిస్తామని తెలిపారు. గ్రామసభలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలతో కలిసి సమీక్ష నిర్వహించి, వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, లైన్‌మన్ ఇస్తారి, ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు బ్రహ్మం, సన్నీ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వీవో లీడర్లు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language