Type Here to Get Search Results !

తల్లిపాలే శిశువుకు తొలి అమృతాహారం

 



Telugu Trends

తల్లిపాలే శిశువుకు తొలి అమృతాహారం

తల్లిపాలతోనే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు సాధ్యం

గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బంది

వెల్దుర్తి, ఆగస్టు 06 (Telugu Trends):

వెల్దుర్తి మండల పరిధిలోని శేరీల గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య రవి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య రవి మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు తొలి అమృతాహారమని, పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఎదుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిపాలు చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ టీచర్లు దేవలత, లక్ష్మి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి–శిశు ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అవసరంపై వివరించారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language