Type Here to Get Search Results !

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

 

Telugu Trends

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

రంగంపేట గ్రామంలో విషాదం

మద్యం వ్యసనం, మానసిక ఆందోళనతో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

కొల్చారం, ఆగస్టు 06 (Telugu Trends):

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేట గ్రామానికి చెందిన వేముల కుమార్ (29) కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా తిరుగుతున్నాడు. దీంతో అతనికి వివాహం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో నిద్రపోయిన కుమార్, గురువారం ఉదయం ఇంట్లోని ముందరి గదిలో సీలింగ్‌కు నైలాన్ చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

మృతుడి అన్న వేముల లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదులో, తన తమ్ముడు వివాహం జరగకపోవడం, మద్యానికి బానిస కావడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు.

ఈ మేరకు  కొల్చారం


పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language