Type Here to Get Search Results !

దోమల నివారణకు కట్టాలలో పంచాయతీ ఫాగింగ్

 


దోమల నివారణకు పంచాయతీ ప్రత్యేక చర్యలు

రామాయంపేట: మండలంలోని కట్టాల గ్రామంలో దోమల నివారణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్త ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రాంతాల్లో పాగింగ్, స్ప్రేయింగ్ నిర్వహించారు.

వర్షాకాలంలో దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీ చర్యలతో పాటు ప్రజల సహకారం ఉంటేనే గ్రామాన్ని దోమల రహితంగా, ఆరోగ్యకరంగా మార్చగలమని సర్పంచ్ కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language