Type Here to Get Search Results !

అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్న దాబాలపై కఠిన చర్యలు

 

ఎన్‌హెచ్–44పై దాబాల్లో అక్రమ మద్యం సేవనానికి అనుమతి.. యజమానులపై కేసులు

తూప్రాన్, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్స్): ఎన్‌హెచ్–44 హైవేపై నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్న దాబాలు, హోటళ్లపై తూప్రాన్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సోమవారం హైవేపై ఉన్న పలు దాబాలు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మనీష్ దాబా, న్యూ రెడ్డి దాబాలలో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత దాబా యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

తూప్రాన్ సీఐ వెంకటరాజాగౌడ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ గంగరాజుతో పాటు పోలీసు సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.


దాబాలు, హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించేందుకు అనుమతించడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పాటు హైవేపై రోడ్డు ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

దాబా, హోటల్ యజమానులకు పోలీసుల హెచ్చరిక:
ఎన్‌హెచ్–44పై నిర్వహిస్తున్న దాబాలు, హోటళ్లలో అక్రమంగా మద్యం సేవించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం సేవనానికి అవకాశం కల్పించినట్లు తేలితే యజమానులు, నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హైవేపై దాబాల నిర్వహణలో అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని సూచించారు.

— తూప్రాన్, తెలుగు ట్రెండ్స్ రిపోర్టర్
ఆర్. చంద్రశేఖర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language