Type Here to Get Search Results !

యువత క్రీడల్లో ముందుండాలి: జీడిపల్లి సర్పంచ్ నర్సు గారి కృష్ణ

 


యువత క్రీడల్లో ముందుండాలి: జీడిపల్లి సర్పంచ్ నర్సు గారి కృష్ణ

మనోహరాబాద్, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్ – టేక్మాల్): యువత క్రీడల్లో ముందుండాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని, మేధాశక్తి చురుగ్గా పనిచేస్తుందని జీడిపల్లి సర్పంచ్ నర్సు గారి కృష్ణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా ప్రతి ఆదివారం ప్రీమియర్ లీగ్ క్రీడలను ఉత్సాహంగా నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో జీడిపల్లి గ్రామానికి చెందిన సూపర్ కింగ్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచి కప్పును సొంతం చేసుకుంది.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ నర్సు గారి కృష్ణ, ఉపసర్పంచ్ పసల రాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజేత సూపర్ కింగ్స్ జట్టును అభినందించి, మొదటి బహుమతిగా కప్పును అందజేశారు. యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని నాయకులు అన్నారు.

క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో గ్రామ యువత కోసం మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువత మండల అధ్యక్షుడు ఎస్. నవీన్, నాయకులు సాయికుమార్‌తో పాటు గ్రామ నాయకులు, ప్రజలు, యువత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.                                                రిపోర్ట్ :R చంద్రశేఖర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language