Type Here to Get Search Results !

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు

 


రాయిన్‌పల్లి వంతెన అంశంలో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అవాస్తవం: కాంగ్రెస్ నేతలు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మార్గం నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుల గంగాధర్ ప్రెస్‌మీట్

తెలుగు ట్రెండ్స్ | మెదక్ | ఆగస్టు 1:

రాయిన్‌పల్లి వంతెన అంశంపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మార్గం నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుల గంగాధర్ అన్నారు. శనివారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాయిన్‌పల్లి వంతెన, రహదారుల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. భారీ వర్షాల కారణంగా వంతెన దెబ్బతినడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సమస్యను గుర్తించిన వెంటనే మంత్రులు, అధికారులతో సమన్వయం చేసి రూ.2.31 కోట్ల నిధులు మంజూరు చేయించి వంతెన పనులు ప్రారంభించారని తెలిపారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారని పేర్కొన్నారు.

యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడి యాదగిరి గౌడ్, తిమ్మానగర్ సర్పంచ్ యాదగిరి, మొబోజిపల్లి సర్పంచ్ మనస, రాములు, కాజీపల్లి సర్పంచ్ కొంగరి యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడాయ, నర్సింహులు, యాదగిరి, చింతల వెంకట్, విజయ్, సాయిబాబా, ఎంఎస్ఎస్ఓ నాయకులు మధు పాటిల్, చింతల మలయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language