Type Here to Get Search Results !

కార్మికుల సమస్యలపై డీసీఎల్ నిర్లక్ష్యం వీడాలి: సీఐటీయూ

 జిల్లాలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


  *నెలకు ఒకసారి అయినా DCL గారు జిల్లా సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలి*


*కార్మికుల సమస్యల పై  DCL గారు నిర్లక్ష్యం విడాలి*


*CITU జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం



 ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం. మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో  జిల్లా రెవెన్యూ అధికారి VRO  అంబదాస్ రాజేషన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

  తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన అనంతరం కార్మిక శాఖకు ప్రత్యేక అధికారి కి మెదక్ జిల్లాకు కేటాయించలేదు. కార్మికులకు యాజమాన్యాలతో వచ్చే వివాదాల పై సంగారెడ్డి లోని డీ,సీ,ఎల్ గారి వద్ద దరఖాస్తు చేయాల్సి వస్తుంది మెదక్ జిల్లా కార్మిక సమస్యల పట్ల సంగారెడ్డి లోని డి,సి,ఎల్ ఆఫీసు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. జాయింట్ మీటింగ్ నోటీసుల యాజమాన్యాలకు పంపడంలో ఆఫీసు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కార్మికులు యాజమాన్యాల వేధింపులకు గురి అవుతున్నారు. 

          ఇటీవల చిన్న శంకరం పేట మండల పరిధిలోని కావేరి ఐరన్ అండ్ స్టీల్ ఇండియా పరిశ్రమలో కనీస వేతనాల సమస్యలపై దరఖాస్తు చేశాము. జాయింట్ మీటింగ్ నోటీసులు పంపడంలో ఆఫీస్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. వారి నిర్లక్ష్యం వల్ల కార్మికుల పై కక్ష సాధింపు యాజమాన్యం ముగ్గులు కార్మికుల్ని (3) విధుల నుండి తొలగించింది. ఇట్టి విషయం పై. 29-07-2026న కార్మికుల డి సి ఎల్ గారి వద్ద దరఖాస్తు చేయగా 4-08-2026 జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఫైల్ పై సంతకం చేశారు. కానీ ఆఫీసు సిబ్బంది యాజమాన్యానికి నోటీసు పంపలేదు. ఇలాంటి ఘటనలు DCL సంగారెడ్డి ఆఫీసులో షరమాములే.  కావున మెదక్ జిల్లా కార్మిక సమస్యల పరిష్కారానికై వారంలో ఒక్కరోజు మెదక్లో డీసీఎల్ గారు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తమరితో కోరుచున్నాము.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ. టౌన్ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language