Type Here to Get Search Results !

యాన్నారం యాదగిరికి జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మధుసూదన్ గౌడ్‌కు కార్యవర్గ బాధ్యతలు



బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గం 

మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా యాన్నారం యాదగిరి.. కార్యవర్గ సభ్యుడిగా మధుసూదన్ గౌడ్ ఎంపిక

కొల్చారం, ఆగస్టు 3 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వడ్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు కీలక నియామకాలు చేపట్టారు.

కొల్చారం మండలంలోని కొంగోడ్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు యాన్నారం యాదగిరిని ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పెద్దన్నగారి మధుసూదన్ గౌడ్‌ను ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, బాధ్యతలు తప్పకుండా లభిస్తాయని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను మరింత బలోపేతం చేయాలని నూతనంగా నియమితులైన నాయకులకు సూచించారు.

నూతనంగా నియమితులైన యాన్నారం యాదగిరి, మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, ఓబీసీ మోర్చాను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీజేపీ అధ్యక్షుడు ఘనపూర్ హరీశ్, మండల ఇంచార్జి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, కొంగోడ్ బూత్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏనిగండ్ల బూత్ అధ్యక్షుడు శ్రీశైలం, సీనియర్ నాయకుడు మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language