Type Here to Get Search Results !

తూప్రాన్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.. చిట్కుల్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళులు

 


తూప్రాన్‌లో రాజీవ్ గాంధీ జయంతి.. ఘనంగా నివాళులు

తూప్రాన్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గురువారం నర్సాపూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్కుల్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ ఆధునికీకరణకు, సాంకేతిక రంగం అభివృద్ధికి, యువత సాధికారతకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ అభివృద్ధిలో యువతకు కీలక పాత్ర ఉండేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గరిగే నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, ఉమర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language