Type Here to Get Search Results !

శీర్షిక లేదు

 

వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో కరాటే, యోగా శిక్షణ ప్రారం

విద్యతో పాటు విలువలు.. కరాటేతో ఆత్మవిశ్వాసం.. యోగాతో ఆరోగ్యం – విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యమని హెచ్‌ఎం సాంబయ్య

వెల్దుర్తి, ఆగస్టు 5 



వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని లక్ష్యంగా చేసుకుని బుధవారం కరాటే, యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ యోగా, కరాటే శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

యోగా శిక్షకురాలు ఇందిరా విద్యార్థులకు యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. అలాగే కరాటే మాస్టర్ వైష్ణవి విద్యార్థులకు ఆత్మరక్షణ విద్య, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందేలా కరాటేలో శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడటంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య అన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణలో చురుకుగా పాల్గొని తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language