Type Here to Get Search Results !

ప్రెస్ క్లబ్ సమస్యలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లిన నూతన కార్యవర్గం

 


ప్రెస్ క్లబ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన నూతన కార్యవర్గం

మెదక్: మెదక్ ప్రెస్ క్లబ్‌కు సంబంధించిన పలు సమస్యలను నూతన కార్యవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లింది. గురువారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శివ్వన్నగారి నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి బచ్చు సంగమేశ్వర్, కోశాధికారి చెవిటి అశోక్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ప్రెస్ క్లబ్‌కు సంబంధించిన సమస్యలను వివరించారు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ భవనం పై అంతస్తు నిర్మాణం, జర్నలిస్టు కాలనీ అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు కాలనీలో నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రెస్ క్లబ్ భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరసింహాచారి, కార్యదర్శి బచ్చు సంగమేశ్వర్, కోశాధికారి చెవిటి అశోక్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language