Type Here to Get Search Results !

జహీరాబాద్‌లో బార్‌ల నిర్వహణపై ఆరోపణలు.. ఎక్సైజ్ నిబంధనలు పాటిస్తున్నారా?

 


ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా బార్‌ల నిర్వహణ?

జహీరాబాద్, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్): ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా జహీరాబాద్‌లోని కొన్ని బార్‌లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సితార రెస్టారెంట్ అండ్ బార్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై సామాజిక కార్యకర్త పబ్బతి సంతోష్‌కుమార్ ఎక్సైజ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బార్‌కు కేటాయించిన మద్యం ఇతర ప్రాంతాలకు తరలించడం, అనధికార విక్రయ కేంద్రాలకు మద్యం చేరుతున్న అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన అధికారులను కోరారు. బార్‌లోని స్టాక్ రికార్డులు, మద్యం బాటిళ్ల సరఫరా, విక్రయాలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

తూతూమంత్రంగా తనిఖీలు చేయొద్దని సూచన

ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాలని సంతోష్‌కుమార్ కోరారు. పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాతే హడావుడిగా తనిఖీలు నిర్వహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

బుధవారం సితార బార్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సంతోష్‌కుమార్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే ఈ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

అయితే, బార్‌పై వచ్చిన ఆరోపణలపై సంబంధిత యాజమాన్యం లేదా ఎక్సైజ్ శాఖ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language