Type Here to Get Search Results !

శీర్షిక లేదు

 


భక్తి శ్రద్ధల నడుమ సూర్యవంశ అరెకటిక బోనాల ఊరేగింపు.. పాల్గొన్న వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్

మెదక్, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలో సూర్యవంశ అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ బోనాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన బోనాల ఊరేగింపు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగింది.

పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, చిన్నారులు, యువతులు, యువకులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా అలంకరించిన దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపులో తీసుకెళ్లగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమానికి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులను అభినందిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పూసల శృతి సంతోష్, సూర్యవంశ అరెకటిక సంఘ సభ్యులు ధర్మకారి ప్రవీణ్, ధర్మకారి రాజు, క్రాంతి, సతీష్, సందీప్, మౌర్య, రాజు, చరణ్, కిరణ్, కళ్యాణ్ 


తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language